Sunday, November 29, 2015
Tuesday, November 17, 2015
Wednesday, November 11, 2015
వల్మిడి పాట
వల్మిడి పాట
పల్లవి: పాడరా పాడు ఎప్పటికప్పుడు
వల్మిడి పాట నీకు వీలున్న చోట
నీ ఆట పాటను విన్నోడల్లా
హత్తుక పోయేలా నిన్ను ఎత్తుక తిరిగేలా ... "పాడరా "
చరణం: వాల్మికిది దివ్యా క్షేత్రం
రాములోరిది దైవా క్షేత్రం
పూజలనొందిన పుణ్యా క్షేత్రం
భక్తులు చేసే భజనల చిత్రం "పాడరా"
చరణం: తాళ్ళ చెర్లా లోతు కోపులు
ఎర్రా చెర్లా నల్ల తుమ్మలు
జోడాగుల్ల జోరును చూసి
పెద్దా గుట్ట పేరును తలిచి "పాడరా"
చరణం: చైతన్యానికి పెట్టిన పేరు
స్నేహమండలి పుట్టిన ఊరు
సంకురాతిరి సంబుర జోరు
జోరుల మునిగే జనం తీరు "పాడరా"
చరణం: పడమటికున్నది పెద్దమ్మ గుడి
తూరుపు దిక్కున పోషమ్మ గుడి
మద్యల ఉన్నది మైసమ్మ గుడి
మస్తుగుoటదోయ్ సూస్తె వల్మిడి "పాడరా "
చరణం: పడమటికున్నది పెద్దమ్మ గుడి
తూరుపు దిక్కున పోషమ్మ గుడి
మద్యల ఉన్నది మైసమ్మ గుడి
మస్తుగుoటదోయ్ సూస్తె వల్మిడి "పాడరా "
రచన: మోకాటి సంతోష్ కుమార్
మంగళ హారతి
శ్రీ వాల్మీకి మహర్షికి మంగళ హారతి
పల్లవి: మంగలమిదిగో .. ఓ మహర్షి శ్రీ వాల్మీకి ---3x
మంగలమిదిగో ....
చరణం: యుగా యుగాలందున
యోగాయోగులు ఎందరో ---2x
నువ్వే మా లోకమనుచు
నీ లోకములోన మునిగే "మంగళ "
చరణం: కాలా కాలాలందున
కవి పండితులు ఎందరో
నువ్వే మా గురువువనుచు
తమగుండేలో గుడి కట్టెను "మంగళ"
చరణం: దేశా దేశాలందున
దివ్య జ్ఞానులు ఎందరో
నీ భావమే దివ్యమనుచు
నీ బాటలో నడువబట్టే "మంగళ"
చరణం: నీ నామము పలుకుటతో
ముక్తి ప్రాప్తిoచుననీ
పలికినా వారెల్లను
పలికిరా పలుకులను "మంగళ"
రచన: శ్రీ మోకాటి సంతోష్ కుమార్
Subscribe to:
Posts (Atom)