Thursday, January 28, 2016
Tuesday, January 19, 2016
ధరిద్రం
నా పేరు ధరిద్రం!
నేను ధరిద్ర దేవతను!!
ఉత్తములంటే నాకు
ఉచ్చ పడుతది!
ధనవంతుల పేరి౦టే
నాకు దడుపు జెరం పుడుతది!!
ప్రపంచంలో ఉన్న
అమాయకులు,
అజ్ణానులు, ఆ బాపతుగాండ్లు
బాంచెన్ కాల్మొక్తనొత్తరు
నా బానిసలై పోతరు!!
సోయి లేనోళ్ళు, సోమరిపోతులు, తాహత్తు లేని తాగుబోతులు,
శాతగాని సవటలు, సన్నాసులు, దద్దమ్మలు
నన్ను పూజించే పరమ
భక్తులు!!
ఇప్పటికే అరవై కోట్ల
భారతీయులు
నా కట్టు బానిసలై
సుట్టు తిరుగుతండ్లు!!
మీ తిరుపతి ఎంకన్నకుందా? యాదగిరి నర్సిమ్మకుందా?
కనక దుర్గమ్మకుందా? సమ్మక్క సారమ్మకుందా?
పాలకుర్తి సోమన్నకుందా? వల్మీడి రామన్నకుందా?
నాకున్న పలుకుబడి!!
ధరిద్రం!
నీ యమ్మ జాతి!!
టాటా, బిర్లా, అంబానీ, ఆధానీ, గాలిగాండ్లను గాలికొదిలేసి!
ఒచ్చినావ్! ఒలిమిడి
ప్రజల ఒంటి మీదికి?
హిరణ్యకశిపుని డొక్కను
చీల్చిన
ఉగ్ర నరసింహులై
ఉరుముత౦డ్లు మా ఊరి పోరగండ్లు!!
సవాలిశిరి ఉరికిత్తరు!
ఉరికిత్తరు, ఉరికిత్తరు ఊరౌతల పాతిపెట్టి
పాతాళం తోక్కేస్తరు!!
ఖబర్దార్ ధరిద్రం!
ఖబర్దార్ ఖబర్దార్!!
వల్మిడి యువ శక్తి!
వర్ధిల్లాలి!!
-మోకాటి సంతోష్ కుమార్
Monday, January 18, 2016
Subscribe to:
Posts (Atom)