Wednesday, November 11, 2020
Monday, November 9, 2020
శ్రీ రామ పూజా విధానము
శ్రీ రామ పూజా విధానముకు సంబంధించిన శ్రీ ఉత్పల వెంకట్రావు గారిచేవిరచితమైన పుస్తములు శ్రీ గురు జనగాం కొమురయ్య గారి ప్రియ శిష్యులు శ్రీ రాపర్తి రామస్వామి గారి నుండి సేకరించబడినవి.
ఆ పుస్తకముల కొరకు క్రింది పేర్లను క్లిక్ చేయండి.
Saturday, August 8, 2020
Wednesday, August 5, 2020
వల్మిడి గ్రామంలో నుండి IFS గా ఎదిగిన కేసారాపు ప్రేమ్ సాగర్ రెడ్డిని సన్మానించి న వల్మిడి వికాస సమితి.
Today Valmidi Vikasa Samithi felicitated Mr.Kesarapu Prem Sagar Reddy for securing good rank in the UPSC Civils examination. He got Indian Foreign Services (IFS) posting. He is role model for many Indians and so is for Valmidites. He said that he is always ready to help the UPSC Civils aspirants of Valmidi. We wish many more people of Valmidi to reach such laurels.
Friday, July 3, 2020
Thursday, June 11, 2020
Wednesday, April 8, 2020
లాక్ డౌన్ లో పేదలకు సహాయం
మహాత్మా హెల్పింగ్ హాండ్స్ మరియు వల్మిడి వికాస సమితి ఆధ్వర్యంలో ఈ రోజు (08/04/2020) వల్మిడి గ్రామంలో 15 మంది నిరుపేదలకు
(i.e.
1.పిట్టల భద్రమ్మ కుటుంబ సభ్యులు
2.చేత ముత్తమ్మ
3.జనగాం సత్తెమ్మ
4.గంట రాములు
5. జిలుకర వెంకటయ్య
6.జలగం ఎల్లయ్య
7.బలిజ ఈశ్వరమ్మ
8.జలగం లచ్చమ్మ
9.గంట అంజయ్య
10.గడ్డం సోమయ్య
11.కొంగరి లచ్చమ్మ
12.కొల్పుల సాంబయ్య
13. మేరుగు యాకమ్మ
14.బత్తోజు (కమ్మరి) బ్రహ్మయ్య
15.చేత సైదులు (సఫాయి))
కోవిడ్-19 నివారణ కోసం ప్రవేశపెట్టిన లాక్ డౌన్ వల్ల కలిగే ఇబ్బందుల నుండి తాత్కాలిక ఉపశమనం కోసం
10kg బియ్యం
1kg కంది పప్పు
1లీటర్ నూనె పాకెట్
1 ఉప్పు పాకెట్
పావు కిలో కారం
1kg ఉల్లిగడ్డలు
చింతపండు
2 సబ్బులు
₹200/- నగదు
పంపిణీ చేయడం జరిగింది. ఈ మహత్కార్యానికి శ్రీ వీరమళ్ళ రాధాకృష్ణ గారు ఒక క్వింటన్ బియ్యం, శ్రీ చెరుకు అశోక్ గారు ₹2000/- నగదు రూపంలో అదేవిధంగా చిన్న వాళ్ళైనా పెద్ద మనసుతో ముందుకొచ్చిన మన గ్రామంలో చదువుకున్న 2012-13 విద్యా సంవత్సరపు పదవ తరగతి విద్యార్థులు మరియు వారి క్లాస్ టీచర్ శ్రీ కొండ్ర కమల్ కుమార్ సార్ అందరూ కలిసి ₹8000/- నగదు రూపంలో సహాయం చేశారు.
ఈ దాతలకు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు అందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధించి ఆయురారోగ్యాలతో వర్ధిల్లి వల్మిడి రాములవారి కృపతో వారికి మరిన్ని సహాయాలు చేసే అవకాశం దక్కాలని మనసా వాచా కోరుకుంటున్నాము. ఈ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టిన మహాత్మా హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు శ్రీ గంట రవీందర్ గారికి అలాగే అందరినీ సమన్వయం చేసి ఈ కార్యాన్ని ముందుకు నడిపించిన శ్రీ పోతుగంటి నర్సయ్య సార్ గారికి వల్మిడీ వికాస సమితి నుండి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్, అలాగే గౌరవ ఉపాధ్యాయులు శ్రీ దోకురు రాములు సార్, శ్రీ వీరమళ్ళ బాబయ్య సార్, శ్రీ కూటికంటి శ్రీనివాస్ (P.E.T) అలాగే గౌరవ గ్రామ పెద్దలు శ్రీ చేబెల్లి యాదగిరి గారు, శ్రీ చెరుకు రాములు గార్లు మహాత్మా హెల్పింగ్ హాండ్స్ సంస్థకు మరియు వల్మిడి వికాస సమితి కి అదేవిధంగా దాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఇంకా మన గ్రామంలో నిరుపేదలు చాలా మంది ఉన్నారు. దయాహృదయులు తమ శక్తి మేరకు సహాయం చేయగలిగితే చాలా మంది ఆకలి తీర్చగలిగిన వాళ్ళం అవుతాం
సర్వే జనా సుఖినో భవంతు
ఇట్లు,
వల్మిడి వికాస సమితి.
Subscribe to:
Posts (Atom)