ధుర్యోధనుడు:
హూం...హూూం..హహహ...
విరాగియైన పాండురాజుకు సరాగిణియై కూడపర్వత్తరాసక్తయైన కుంతికీ జనియించిన పాండవులు
ఆబాల్యమూ ఆటపాటలలో మమ్మలమటపెట్టిన పాండవులు
లక్కాగృహమును నిశీథిని నిట్టనిలువునా దహించినాడని మామీద నీలాపనిందలు వేసిన పాండవులు
ఏకచక్రపురమున విప్రవేశములతో ఇల్లిల్లూ తిరిపమెత్తి పలుకూల్లు మెక్కిన పాండవులు
అంతకు దగ్గ గంతగా అతుకుల బొంతగా ఐదుగురూ ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు
సునాయువసాతంకలితశల్యము సంప్రాంప్తించిన శునకమునట్లు మా పితృదేవతాయబ్దమై ఇంద్రప్రస్థ వైభవముతో నేను యాగకార్య దూర్వగులగుటయా..? హహ
నారథ ప్రేరణమున తమ తండ్రి యమలోకము నుండి స్వర్గలోకము జేర్చుట దీని ఆంతర్యమటా..? హ
ఏమి కల్పనాచాతుర్యమూ... ఏమి కల్పనాచాతుర్యమూ..?
అయిననూ కుంతీ మూలమున స్వర్గనారకాధిపతులిరువురూ పాండురాజునకు తమ్ములేకద ఆయనెందున్ననూ జరుగనిదేమీ లోపమేమీ? హహహహ
అయ్యారే..సకలరాజన్యలోకమూ సాహో నినాదాలు సలుప భారత భారతీ శుభాశిస్సులతో పరిపాలన సాగించెడి మాకు మారాకుగా సార్వభౌమత్వము సాధించగోరెడి పాండవుల దుష్ప్రయత్నమా ఇది?
రారాజుతో సాటిరాజు కావాలని నేడు ధర్మజుడి ధుష్టంతరమా ఇది?
అయినచో కుతంత్రముతో క్రూచిత బుద్దితో శయనించిన ఈ రాజసూయము సాగరాదు నేనేగరాదు.
శకుని:
అని గట్టిగా అనరాదు... వేరకరు వినరాదు.
నీవు పోనిచో అనిమిత్త క్రోధంతో అసూయగ్రస్థుడై సుయోధనుడు రాజసూయానికి వెల్లలేదంటుంది ఈ వెర్రిలోకం.
ఒకవేళ నీవు పోకపోయిననూ యూగమా ఆగునది కాదు
పోయినచో స్వజనులమీది సమాధరణతో వచ్చినాడన్న మంచిపేరు నీకు దక్కుతుంది.
ఎదరి బలాన్నీ బలగాన్నీ కనిపెట్టే అదనూ చిక్కుతుంది.
వేయేల కురుసార్వభౌముడు మాననీయుడూ మంచివాడన్న కీర్తి నీవు దక్కించుకో.
ఆపైన కొంచెపు వంచన పనులన్నింటికీ అయినవాన్నీ అమ్మ తమ్మున్నీ నేనున్నానుగా.
ముల్లును ముల్లుతోనే తియ్యాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి
కనుక, హిత పురోహిత దుత్య వాక్య సామంత దండనాయక వారవనితా జనితా నృత్య నాట్య కళా వినోద మనోహరంబగు పరివారముతో, చతురంగబల సమేతులై, శతసోధర సమన్వితులై
శ్రీ శ్రీ శ్రీ గాంధారీసుతాగ్రజులు ఇంధ్రప్రస్థపురానికి విజయం చేయవలసిందే రాజసూయాగము సందర్శించవలసిందే.
No comments:
Post a Comment